భర్తను కడతేర్చేందుకు యత్నించి.. | - | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చేందుకు యత్నించి..

Nov 30 2025 7:34 AM | Updated on Nov 30 2025 7:36 AM

పక్కాగా స్కెచ్‌ వేసిన భార్య సలసలా కాచిన నూనెను నిద్రిస్తున్న భర్తపై పోసిన ఇల్లాలు ఐదునెలలుగా పరారీలో నిందితులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసిన పోలీసులు

పలమనేరు : సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఈ మధ్య ప్రియుడి కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే పలమనేరు మండలంలో ఐదు నెలల క్రితం జరగ్గా ఎట్టకేలకు శనివారం ఈ కేసులో నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ స్వర్ణతేజ తెలిపారు. ఆ వివరాలు ఇలా.. మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్‌, శిల్ప భార్యాభర్తలు. భర్త సీ. వెంకటేష్‌ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్‌ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీలోని సీ.వెంకటేష్‌ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మను షులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి సీ.వెంకటేష్‌ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త సీ. వెంకటేష్‌ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్‌ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు.

భర్తను చంపాలని ప్రయత్నించిన భార్య శిల్ప, ప్రియుడు ఎం.వెంకటేష్‌

భర్తను కడతేర్చేందుకు యత్నించి.. 1
1/1

భర్తను కడతేర్చేందుకు యత్నించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement