– కాణిపాకంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ
కాణిపాకం : ఆలయానికి ఎస్పీడీసీఎల్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ విధానానికి ప్రతిపాదనలు పంపాలని విద్యుత్ అధికారులను రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. పండితుల ఆశీర్వచనాలు, స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. స్వామి సన్నిధికి ఎలాంటి సేవలు అందించడానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కోనసీమ జిల్లాలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగిన ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 పోటీల్లో కాణిపాకం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. యువశ్రీ వ్యక్తిగత విభాగంలో కాంస్యం, నోహిత్ బంగారు పతకం సాధించారన్నారు. డిసెంబర్‌లో మహారాష్ట్రలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రతిపాదనలకు ఆదేశం


