బస్సుల ఫిట్‌నెస్ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల బస్సులు ఫిట్‌నెస్ తప్పని సరి అని రవాణాశాఖ ఎంవీఐ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా రవాణాశాఖ అధికారులు విజ యం విద్యాసంస్థల బస్సుల ను తనిఖీ చేసి, ఆ పాఠశాల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంవీఐ మాట్లాడుతూ పాఠశాల బస్సులు నాణ్యత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అధిక వేగంతో వెళ్లకూడదని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్‌లు జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ఆ విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్సుల రికార్డులు తనిఖీ చేశారు. ఎంవీఐ మురళి, నరసింహులు పాల్గొన్నారు.


