‘దేవగుడి’ సినీ చరిత్రలో నిలిచిపోతుంది
పూతలపట్టు(యాదమరి): దేవగుడి సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్థం చేశారు. శుక్రవారం మండల పరిధి వేము ఇంజినీరింగ్ కళాశాలలో ఆ చిత్ర హీరో, హీరోయిన్లు సందడి చేశారు. రామకృష్ణా రెడ్డి మాత్లాడుతూ.. రాయలసీమ నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఒక భావోద్వేగంతో కూడిన సినిమా తీశామన్నారు. కేవలం కథను నమ్ముకుని చిత్రాన్ని తీశామని చెప్పారు. అనంతరం దేవగుడి సినిమా హీరో, హీరోయిన్లు అభినవ్ శౌర్య, అనుశ్రీ విద్యార్థులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కిలారి తదితరులు పాల్గొన్నారు.


