విద్య.. క్రీడలతో ఉజ్వల భవిత
యాదమరి : విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తే ఉజ్వల భవిత సాధించవచ్చని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందుతాయన్నారు. అలాగే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే అలవాటును అలవర్చుకోవచ్చని వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు రాణిస్తున్నారని వివరించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం పొందవచ్చని చెప్పారు. అనంతరం టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ ఈశ్వర్, బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు పాల్గొన్నారు.


