అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
చిత్తూరు కలెక్టరేట్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతి బాపూలే అని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో పూలే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పీసీఆర్ సర్కిల్‌లో ఉన్న పూలే విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శనీయులన్నారు. చిన్నతనంలోనే వితంతువులైన మహిళలకు పునర్వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఆర్‌వో మోహన్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ రబ్బానీబాషా, నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వేదాలకు సరికొత్త భాష్యకారుడు
మహాత్మ జ్యోతిబా పూలే వేదాలకు సరికొత్త భాష్యకారుడని వైఎస్సార్‌సీపీ కో–ఆప్షన్ మెంబర్ ఆను కొనియాడారు. పీసీఆర్ సర్కిల్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సుధీర్, హమీద్, సద్దామ్, షాన్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయం
మహాత్మ జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయమని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ విభాగాధిపతి గోపినాయక్ కొనియాడారు. ఈ మేరకు పీవీకేఎన్ కళాశాలలో పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చరిత్ర అధ్యాపకులు రెడ్డిబాషా, అర్థశాస్త్ర అధ్యాపకులు కోటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు రాజేష్, ఉమాదేవి, చంద్ర పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే


