శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు విశేష పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయకర్తలకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 59,548 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,548 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది.


