ఎలా బతికేది బాబూ?
న్యూస్‌రీల్
ఒకే సారి ఏడు పరిశ్రమలకు భూముల కేటాయింపు
ఏడింటికి శంకుస్థాపన చేసిన
సీఎం చంద్రబాబు
మొత్తం 2243.12 భూముల
కేటాయింపు
పనుల ప్రారంభానికి మీనమేషాలు
అయోమయంలో అన్నదాతలు
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఇటీవల ఒకేసారి ఏకంగా ఏడు పరిశ్రమల స్థాపనకు శంఖుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమలకు రైతుల వద్ద నుంచి సుమారు 2243.12 ఎకరాలు సేకరించారు. ఆపై ఆయా భూముల్లో బోర్డులు పెట్టి మిన్నకుండిపోతున్నారు. ఉన్న భూములు కోల్పోయి.. పరిశ్రమల్లో ఉపాధి దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. మేమేం చేయాలి.. ఏం తినాలి బాబూ.. అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు.
పలార్లపల్లి వద్ద పరిశ్రమలకు కేటాయించిన వ్యవసాయ భూములు
2,68,066 మందికి పింఛన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1న 2,68,066 మందికి రూ.114.80 కోట్ల మేర పింఛన్ పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1న పింఛన్‌ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 27 రకాల పింఛన్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 16 రకాల సామాజిక పింఛన్‌లకు 2,65,525 మందికి రూ.111.46 కోట్లు, ఆరో గ్య సమస్యల పింఛన్‌లు 2,541 మందికి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
నేటి నుంచి
టీచర్ల క్రీడా పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని టీచర్లకు శనివారం నుంచి జనవరి 4వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు విద్యాశాఖ, జిల్లా సమగ్రశిక్ష శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వహణకు మండలానికి రూ.5 వేలు, డివిజన్‌కు 20 వేలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.20 వేల చొప్పున బడ్జెట్‌ను కేటాయించారు. ఈ పోటీలలో జనరల్ టీచర్‌లకు, పీఈటీలకు వేర్వేరు టీంలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు.
1న ఫర్నీచర్ వేలం
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు కార్యాలయంలో ఉపయోగించిన ఫర్నీచర్‌ను డిసెంబర్ 1వ తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఏసీ, జనరేటర్, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ఉదయం 10.30 గంటలకు చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో వేలం పాటలో విక్రయిస్తామన్నారు. వివరాలకు పోలీసు కార్యాలయ సూపరింటెండ్ పుష్పరాజ్‌ను సంప్రదించాలని సూచించారు.
డిసెంబర్ 7న
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 7న ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణపై పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లాలో గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 7న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌టికెట్లను వాట్సాప్ మనమిత్ర యాప్‌లో, www. bse.ap.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పిదాలు ఉంటే సంబంధిత విద్యార్థి హెచ్‌ఎం ధ్రువీకరించే లేఖతో పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌తో నామినల్ రోల్‌లో నమోదు చేయించుకోవాలని చెప్పారు. హాల్ టికెట్ పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పరీక్ష కేంద్రం వివరాలు, రూట్ తెలుసుకునేలా వెసులుబాటు కల్పించారు.
రైతులు కూలీలవుతున్నారు
శాంతిపురం మండలంలో రైతులకు ఒక సెంటు భూమి లేకుండా ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక్కడ రైతులు కూలీలుగా మారా ల్సి వస్తోంది. పంటలకు సారవంతమైన భూములు ఎయిర్ పోర్టుకోసం ప్రభ్తుత్వం సేకరిస్తోంది. సర్వేలు కూడా పూర్తి చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మా పరిస్థితి ఏంటో తెలియడం లేదు.
– చక్రపాణిరెడ్డి, రైతు, దండికుప్పం
నమ్మకం లేదయ్యా!
విమానాశ్రయానికి 1,800 ఎకరాలు, పరిశ్రమలకు 243 ఎకరాల మేర సేకరించి పారిశ్రామిక వేత్తలకు అప్పగించింది. దీని ద్వారా కుప్పం యువతకు ఉపాధి దొరుకుతుందనే నమ్మకం లేకుండా పోతోంది. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఎలాంటి ఉపాధి అవకాశాలొస్తాయో అంతుపట్టడం లేదు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారనేది కచ్చితంగా చెప్పలేము. దీని వల్ల భూములు పోగొట్టుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిందే.
– నారాయణప్ప,
కీలకపోడు గ్రామం
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమల పేరుతో ఆర్భాటం సృష్టించిన బాబు ప్రభుత్వం భూములు లాక్కొని మిన్నకుండి పోతోంది. ఉన్న భూములు కోల్పోయిన రైతులు చేసేందుకు పనుల్లేక.. తినేందుకు మెతుకుల్లేక అల్లాడిపోతున్నారు. పరిశ్రమల యాజమాన్యం తమకు కేటాయించి స్థలాల్లో ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి వెళ్లిపోయారు. ఉద్యోగాలపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
భారీగా భూముల కేటాయింపు
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏడు భారీ పరిశ్రమల స్థాపనకు కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథార్టీ చర్యలు చేపట్టింది. వీటికి గాను గుడుపల్లె మండలం, పొగురుపల్లె వద్ద, కుప్పం మండలం, పలార్లపల్లి, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లి, రామకుప్పం మండలం, విజలాపురం వద్ద ఏడు పరిశ్రమలకు భూములు కేటాయించారు. దీంతో పాటు విమానాశ్రయం కోసం దండికుప్పం వద్ద సర్వేలు పూర్తి చేసి భూములు ఎంపిక చేశారు. విమానాశ్రయంతో సహా ఏడు పర్రిశమలకు 2243.12 ఎకరాలు కేటాయించారు.
సకాలంలో పూర్తికాకపోతే?
కుప్పంలోని యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పలు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫ్యాక్టరీల నిర్మాణానికి వ్యవసాయ భూములు సేకరించింది. నిర్వాహకులు సకాలంలో ఫ్యాక్టరీలు స్థాపించకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు మదనపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలొస్తాయనే ఆశతో భూములిచ్చామని, కానీ ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తే పరిశ్రమలు నెలకొల్పతారనే నమ్మకం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దండి
చిత్తూరు ఎమ్మెల్యేపై జనసైనికుడి అసహనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో పారిశ్రామిక వేత్త ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల శా ఖ డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తులను ఉద్దేశ పూర్వకంగా పెండింగ్ పెడితే చర్యలు తప్పవని హెచ్చ రించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరతిగతిన మంజూరు చేయాలన్నా రు. జిల్లాలో 2026 డిసెంబర్ నాటికి 220 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
నాణ్యతలో రాజీపడొద్దు
జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ 12 ప్రాజెక్టుల సీడీపీవోలు కచ్చితంగా 25 అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి 5 అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో పిల్లల తల్లిదండ్రులను చేర్చి కార్యక్రమాల వీడియోలను పంపించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీవోలు అరుణశ్రీ, శామ్‌సుగుణ, వినితశ్రీ, అరుణశ్రీ, నిర్మల, శోభ, ఉమావాణి పాల్గొన్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చిత్తూరులో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతోంది. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడు గెలుపులో జనసేన కార్యకర్తల కృషిని ఆ పార్టీ నేతలు మరచిపోయారంటూ పలు సందర్భాల్లో సామాజిక వేదికల్లో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటికే భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి చెందిన వాళ్లను పట్టించుకోలేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా చిత్తూరు గంగనపల్లెకు చెందిన జనసేన కార్యకర్త రూపేష్‌కు బుధవారం రాత్రి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై జనసేనకు చెందిన ఏకే.శరవణ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జనసేన పార్టీలో వంద మందికి పైగా కార్యకర్తలకు సభ్యత్వం చేయించిన రూపేష్ టీడీపీలో చేరడం విచారకరమంటూనే.. అతడిని టీడీపీలోకి చేర్చుకోవడం మిత్ర ధర్మమా..? కూటమి ధర్మం ఇదేనా..?? అంటూ ప్రశ్నలు సంధించాడు. దీనికి చాలామంది జనసేన కార్యకర్తలు మద్దతు పలుకుతూ.. ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు. అయితే సంతపేట టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా ఉన్న వ్యక్తి తప్పిదమే కారణమంటూ ఎమ్మెల్యే వర్గం సమాధానాలిస్తోంది. ఇటీవల జనసేన పార్టీకి చెందిన దయారామ్ నాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేను ఏకంగా ఓ పోరంబోకు అని తిట్టి, ఆపై క్షమాపణ చెప్పడం తెలిసిందే. మొత్తానికి చిత్తూరులో టీడీపీ–జనసేన మధ్య వైరం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది.
విమానశ్రయం పరిస్థితి ఏమిటో?
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల వద్ద విమానాశ్రయం నిర్మించేందుకు పదేళ్లుగా చర్యలు చేపడుతున్నారు. 2014లోనే కార్గో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు 490 ఎకరాలు సేకరించేందుకు సర్వేలు చేశారు. కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టాక విమానాశ్రయంతో పాటు చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపించేందుకుగాను అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించి సర్వేలు జరిపారు. ఇప్పుడు విమానాశ్రయం కోసం ఏకంగా 1,800 ఏకరాలు సిద్ధం చేశారు. కార్గో ఎయిర్‌పోర్టుకు ఇన్ని ఎకరాలు అవసరమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కుప్పంలో పరిశ్రమల
స్థాపన సాధ్యమయ్యేనా?
ఎలా బతికేది బాబూ?
ఎలా బతికేది బాబూ?
ఎలా బతికేది బాబూ?


