నన్నే కొట్టి..నాపైనే కేసు పెట్టి!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాననే అక్కసుతో టీడీపీ సానుభూతిపరులు తనపై దాడి చేసిందేకాకుండా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని పెద్దపంజాణి మండలం, కొళత్తూరు పంచాయతీ, గుత్తివారిపల్లికి చెందిన బాధిత వలంటీర్ వెంకటరమణ గురువారం తెలిపారు. ఈ నెల 24న తన ఇంటి పక్కనే ఉన్న టీడీపీ నేత కుమార్ కావాలనే మరుగునీటిని తమ ఇంటివైపునకు పంపారన్నారు. దీనిపై తాను ప్రశ్నించగా తనపై దాడికి దిగాడని తెలిపారు. దీన్ని చూసి అక్కడే ఉన్న తమ మామ రామచంద్ర తలపై రాతితో కొట్టారన్నారు. దీంతో తామిరువురూ పలమ నేరులో ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లామని చెప్పా రు. ఆపై తమకు న్యా యం చేయాలని పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశాయగా.. ఆ ఫిర్యాదును పక్కనబెట్టిన పోలీసులు అధికార పార్టీ అండతో తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గంగవరం సీఐ పరశురామున్ని వేడుకోగా ఎస్సీలతో పెట్టుకుంటే ఇట్టే ఉంటుందని చెప్పి పంపించారని తెలిపారు. తమకు న్యాయం జరక్కుంటే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


