ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతి
గుడుపల్లె: ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొని ధనలక్ష్మి(28) అనే మహిళ బుధవారం రాత్రి మృతి చెందింది. గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు కథ నం... మండలంలోని గుండ్లసాగరం గ్రామానికి చెందిన ధనలక్ష్మి బుధవారం సాయంత్రం రోడ్డు పక్కన వాకింగ్ వెళ్తోంది. వెనుక నుంచి స్కూల్ పిల్లలను తీసుకుని కుప్పంకు చెందిన ఏవీఆర్ స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ధనలక్ష్మిని ఢీకొట్టింది. ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ధనలక్ష్మి మృతిచెందింది. గురువారం ఏవీఆర్ స్కూల్ బస్సు, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ధనలక్ష్మి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.


