ఇప్పటికీ కేసు లేదు!
ముఠాపై చర్యలు వద్దు
దారి దోపిడీ ముఠాపై
చర్యలు ఎక్కడ?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దారి దోపిడీ ముఠాపై ఇప్పటికీ చర్యలు తీసుకోక ఖాకీలు మౌనం వహిస్తున్నారు. బాఽ దితుడు స్టేషన్‌కు వెళ్లినా ఇంటరాగేషన్ పూర్తిచేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓ టీడీపీ యువ నేత ఓ ప్రజాప్రతినిధి అండతో ఇలా రెచ్చిపోతున్నాడని, అతన్ని అరికట్టకపోతే పార్టీకి పరువుపో తుందని చిత్తూరు సీనియర్ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఇతనిపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుడు టీడీపీ నాయకుడు కావడంతో అతనికి వారు నచ్చజెబుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా కొంతమంది నాయకులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బాధితుడు మా త్రం తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజలను ఇంకేలా భయభ్రాంతులకు గురిచేస్తారోనని ఓ ప్రజాప్రతినిధి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీనిపై కేసు నమో దు చెస్తేనే మిగతా వారికి కూడా భయం ఉంటుందని చెప్పినట్టు తెలిసింది.
డ్రగ్స్ రవాణే టార్గెట్
డ్రగ్స్ రవాణే ఈ ముఠా టార్గెట్‌గా తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గం మొత్తం ఈ ముఠానే డ్రగ్స్‌ను సప్‌లై చేయడంతో పాటు తమిళనాడు ప్రాంతానికి కూడా చేరవేస్తున్నాట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలో ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో అధిక సంఖ్యలో ఆంధ్ర, తెలంగాణాకు సంబంధించిన యువకులు చదువుకుంటున్నారు. వీరందరికీ డ్రగ్స్ సరఫరాను ఈ ముఠానే అందజేస్తోందని సమాచారం. ఇందుకు చి త్తూరు, గుడిపాల కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇందుకు కొంతమంది యువకులను ఈ ముఠా ప్రోత్సహించి వ్యాపారాలు సాగిస్తున్నట్టు సమాచారం.
చిత్తూరు యువనేత ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం జరిగిన హైజాక్ ముఠాపై చర్యలు తీసుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి పోలీసులను ఆదేశించాడు. దీంతో పోలీసులు కుడా మౌనం వహిస్తున్నారు. ఒకవేళ కేసు పెడితే బదిలీలు చేస్తారేమోనని వారు భయపడుతున్నారు.


