కంటెంట్ నమ్మి తీసిన చిత్రం దేవగుడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): స్టార్స్‌ని కాకుండా కేవలం కథ, కంటెంట్‌ను నమ్ముకుని తీసిన చిత్రం మా దేవగుడి. రాయలసీమ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా తీసిన దేవగుడి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, కథానాయక, నాయికలు అభినవ్ సౌర్య, అనుశ్రీ కోరారు. గురువారం చిత్తూరులోని పలు ప్రాంతాల్లో దేవగుడి చిత్ర యూనిట్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కటెంట్‌ను తీసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషన్ డ్రామాగా సినిమా సాగుతుందన్నారు. డిసెంబర్ 19న ప్రేక్షకుల మధ్యకు రాబోతున్న ఈ సినిమాలో హైదరాబాద్‌కు చెందిన అభినవ్ సౌర్య హీరోగా, బీమవరానికి చెందిన అనుశ్రీ హీరోయిన్‌న్‌గా నటిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా సినీ రంగంలో అడుగుపెట్టిన వారికి ఆశీస్సులు అందించాలన్నారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టామని, మా డైరెక్టర్ బెల్లం రామకష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఈరోజు మీ ముందు నిలబడ్డామని హీరో,హీరోయిన్ తెలిపారు.
విద్యార్థులకు అభినందనలు
చిత్తూరు కలెక్టరేట్ : మాక్ అసెంబ్లీలో పాల్గొని ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్‌లు, బహుమతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటడం గొప్ప విషయమన్నారు. జిల్లాలోని 21 మంది విద్యార్థులు తమ దైన శైలిలో మాక్ అసెంబ్లీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు.


