గర్భకోశ వ్యాధులను నిర్మూలిద్దాం!
తవణంపల్లె: పాడి రైతులు పశుపోషణలో తగు మెలవకులు పాటిస్తే గర్భకోశవ్యాధులను సమూ లంగా నివారించవచ్చని పశుసంవర్థకశాక డీడీ డాక్టర్ ఆరీఫ్ తెలిపారు. గురువారం మండలంలోని ఈచనేరిలో ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో పాడి పశువులకు ఉచితంగా గర్భకోశవ్యాధి నివారణకు పశువైద్య శిబిరం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డీడీ డాక్టర్ ఆరీప్ మాట్లాడుతూ గర్భకోశవ్యాధి నివారణ కోసం లవణ మిశ్రమ(మినరల్ మిక్స్‌ర్) వాడాలని సూచించారు. పేయదూడల సంకరక్షణపై రైతులు దృష్టి సారించాలన్నారు. తిరుపతి ఏపీఎల్‌డీఏ ఈఓ డాక్టర్ రెడ్డికుమార్ మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం 35 పాడి ఆవులకు గర్భకోశవ్యాధులకు సంబంధించి పరీక్షలు చేయించి చికిత్స అందించారు. 210 ఆవులకు బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు మందులు పిచికారీ చేశారు. రైతులకు మినరల్ మిక్సర్, టానిక్‌లు పంపిణీ చేశారు. శువైద్యాధికారులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ లావణ్య, డాక్టర్ పినాకపాణి, సర్పంచ్ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


