ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. ఈ మేరకు విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌వోలను నియమించేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీఎల్‌వోలు అందరికి ఐడీ కార్డులు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 7,77,924 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో అనే కార్యక్రమాలపై 117 వినతులను స్వీకరించి 109 పరిష్కరించినట్లు వెల్లడించారు. డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.


