వైఎస్సార్‌సీపీ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు!
సదుం: వైఎస్సార్ సీపీ పాలనను ప్రజలు మళ్లీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం సదుం మండలంలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేశారని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి, పేద విద్యార్థుల చదువులను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. సదుంలో సుబ్రమణ్యం స్వామి ఆలయానికి నూతన ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత వైఎస్సార్‌సీపీ నాయకులు సాకేత్ రెడ్డి కుమారై సౌమ్య, ఉదయ్ కుమార్ రెడ్డి నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం 79ఏ చింతమాకులపల్లె పంచాయతీ బొనుగుపల్లెలో సుబ్రమణ్యం రెడ్డి ఇంట్లో జరిగిన శుభ కార్యయానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీపీ ధనంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నారాయణరెడ్డి, గిరిధర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.


