లాఠీ నిరీక్షణ! | - | Sakshi
Sakshi News home page

లాఠీ నిరీక్షణ!

Nov 26 2025 6:51 AM | Updated on Nov 26 2025 6:51 AM

లాఠీ

లాఠీ నిరీక్షణ!

● జూలైలో కానిస్టేబుల్‌ ఫలితాలు.. మరి శిక్షణ ఎప్పుడో? ● ఇప్పటికే నాలుగు నెలల శిక్షణ వేతనం కోల్పోయినట్లే ● జిల్లాలో 850 మంది అభ్యర్థులు ● ఎంపీడీఓ ప్రధాన గేటు పక్కనే మట్టితోలి చదును చేసినా పట్టించుకోరా?

కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా పిలుపులేదే?

బాబు చరిత్ర హీనుడు!

కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ప్రజల దృష్టిలో చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మంగళవారం సీడీ కండ్రిగ, టీకేఎం పేట పంచాయతీల్లో సర్పంచ్‌ ఆకుల మంగమ్మ, ఎంపీటీసీ నందిని ఆధ్వర్యంలో నిర్వహించి కోటి సంతకాల పత్రాలను పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వైద్య విద్యార్థుల జీవితాలను అందకారంలో నెట్టేందుకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీ కరణకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ వారికి దోచి పెట్టడానికి చంద్రబాబు కుఠిల యత్నం చేయడం మంచిది కాదన్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఒక్క మెడికల్‌ కళాశాలను కూడా నిర్మించలేదని మండిపడ్డారు. జగనన్నకు ఉన్న జన బలాన్ని చూసి ఓర్వలేక కొన్ని పచ్చపత్రికలు అబద్ధాలను వండి వార్చుతున్నాయన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ కమిటీ అధ్యక్షుడు ఆకుల గోపి, నాయకులు ధన్‌రాజ్‌, వెంకటేష్‌, రంగయ్య, రాజారాం యాదవ్‌, బుర్ర వెంకటేష్‌, రెండు పంచాయతీల వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.

కళ్లెదుటే కబ్జా!

చౌడేపల్లె: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోకి వెళ్లే ప్రధాన గేటు పక్కనున్న ఖాళీ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేయడానికి యత్నించారు. మట్టితోలి చదును చేసి ఆక్రమణకు సిద్ధమయ్యారు. దీనిపై అధికారులెవ్వరూ తమకు సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయారు. అసలు ఈ స్థలం తమదేనా..? అంటూ అధికారులే చర్చించుకోవడం కొసమెరుపు. ఈ విషయమై ఎంపీడీఓ లీలామాధవిని వివరణ కోరగా.. కార్యాలయం స్థలం వరకు చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేశామని బదులిచ్చారు. ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి సంబంధించినదా..లేదా రెవెన్యూ స్థలమా తేలాల్సి ఉందన్నారు.

చిత్తూరు అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో విడుదైన కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు టీడీపీ సర్కారు వచ్చాక తుది మెరుగులు దిద్దింది. ఫలితాలు ప్రకటించి ఆ క్రెడిట్‌ను తన ఖాతాలోకి వేసుకుంది. కానీ ఫలితాలు విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఇప్పటి వరకు శిక్షణ ప్రారంభం కాలేదు. అసలు దీని గురించి ఆలోచించేవాళ్లే లేరని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.

అలా.. బీజం

2022 నవంబర్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో 240 కానిస్టేబుల్‌, 630 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. మొత్తం 870 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా 2023 జనవరిలో ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేసింది. ఆపై ఎమ్మెల్సీ ఎన్నికలు, హోంగార్డులు కొందరు కోర్టుకు వెళ్లడం, అటు తరువాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. అదే నోటిఫికేషన్‌కు కొనసాగించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. ప్రిలిమ్స్‌ లో అర్హత సాధించిన అభ్యర్థులకు గతేడాది డిసెంబర్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, ఈ ఏడా ది జూన్‌లో తుది పరీక్షలు నిర్వహించి జూలై నెలాఖరున ఫలితాలు విడుదల చేసింది. జిల్లాలో 870 ఖాళీలకు గాను 850 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌ సివిల్‌కు 223 మంది, కానిస్టేబుల్‌ ఏఎపీఎస్పీకు 627 మంది ఎంపికయ్యారు.

వేతనం పోయినట్లేగా?

ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీనే చాలా ముఖ్యం. పది నెలల శిక్షణ అనంతరం పోస్టింగులు ఇస్తే సీనియారిటీ వచ్చేది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ సీనియారిటీకి సైతం పోయినట్టే. ఇక ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమై ఉంటే స్టైఫండ్‌ కింద ఒక్కొక్కరికీ నెలకు సగటున రూ.18 వేలకు పైగా వేతనాలు ఇవ్వాలి. 850 మందికి నెలకు కనీసం రూ.1.53 కోట్ల చొప్పున నాలుగు నెలలకు కలిపి దాదాపు రూ.6 కోట్లకు పైనే వేతనాలు ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకు అసలు శిక్షణపై ప్రభుత్వం స్పందించకపోవడం, తమను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాట్లు చేసిచేసి!

కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదలైన పది రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుందంటూ ప్రభుత్వం నుంచి జిల్లా పోలీసుశాఖకు సమాచారం అందింది. దీంతో చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి బూజు దులిపి.. దులిపి అధికారులు అలసిపోయారే తప్ప.., ప్రభుత్వం నుంచి శిక్షణపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అభ్యర్థుల వసతి, తరగతి గదులు, సౌకర్యాలపై పలుమార్లు డీటీసీను సిద్ధం చేసి విసిగిపోయారు.

లాఠీ నిరీక్షణ! 1
1/1

లాఠీ నిరీక్షణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement