నమోదు చేసుకుంటేనే ఆర్థిక తోడ్పాటు
చిత్తూరు కలెక్టరేట్: గతంలో ప్రధానమంత్రి మాతృ త్వ వందన యోజన పథకం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలు జరిగేది. ప్రస్తుతం ఆ పథకం బాధ్యతలను సీ్త్ర శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అ ధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు ఆ పథకంలో జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణుల పేర్లు నమోదు చేస్తున్నారు. కార్యకర్త లాగిన్ నుంచి పర్యవేక్షకురాలికి పంపేలా చర్యలు చేపడుతున్నారు. అనంతరం పర్యవేక్షకురాలి నుంచి జిల్లా ఐసీడీఎస్ పీడీ లాగిన్‌కు వివరాలను చేర వేస్తున్నారు. జిల్లాలో ఈ పథకానికి అర్హత కలిగిన మహిళలు పేర్లను నమోదు చేసుకుంటే ఆర్థిక తో డ్పాటు అందనుంది. మొదటి ప్రసవంలో రూ.5 వేలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ పుడితే రూ.6 వేలు అందిస్తారు. దీంతో పాటు పోషకాహారం సైతం అందించనున్నారు. మహిళ గర్భం దాల్చిన వెంటనే సంబంధిత అంగన్‌వాడీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుంటే రూ.3 వేలు, ప్రసవం అనంతరం మూడు టీకాలు వేసుకున్నాక రూ.2 వేలు అందజేస్తారు. రెండవ కాన్పులో ఆడబిడ్డ పుడితే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 వేలు జమచేస్తారు.
వివాహిత అదృశ్యం
బంగారుపాళెం: మండలంలోని ఊటువంక గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామానికి చెందిన హరికృష్ణ భార్య భార్గవి (30) గత నెల 31వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ కోసం విచారణ చేసి నా ఫలితంలేదు. దాంతో భర్త హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


