గంజాయి విక్రేత అరెస్టు
నగరి : మండలంలోని ఓజీ కుప్పంలో గంజాయి విక్రయిస్తున్న లింగేశ్వరి అలియాస్ జ్యోతి (45) అనే మహిళను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ తెలిపిన సమాచారం మేరకు డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ నేతృత్వంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం అందిన సమాచారం మేరకు ఓజీకుప్పం గ్రామంలో గంజాయి విక్రయిస్తుండగా లింగేశ్వరి అలియాస్ జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన 1.25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ మహిళపై గతంలో నగరి, పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో 5 గంజాయి విక్రయ కేసులు నమోదయ్యాయి.


