ఇద్దరు అరెస్టు.. రెండు బైకుల స్వాధీనం
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాలను చోరీ చేసే నిందితుల ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ నెట్టికంటయ్య కథ నం మేరకు, చిత్తూరు నగరంలో ఇటీవల రెండు బైకులు చోరీకి గుర య్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కట్టమంచి వద్ద ఎస్‌ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన మహేష్, ధర్మరాజులగుడివీధికి చెందిన వసీం వేర్వేరు బైకుల్లో వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐ విచారించగా, చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిసలై డబ్బుల కోసం చోరీలు చేస్తున్నట్లు అంగీకరించారు. డూప్లికేటు తాళాలతో బైకులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి, రెండు బైకులను సీజ్ చేశారు. నిందితుల ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, జుడీషియల్ కస్టడీకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.


