వర్షం వస్తే అంతే!
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలం, మోటుమల్లెల గ్రామ పంచాయతీ, వంకిరెడ్డిగారిపల్లె సమీపంలోని అచ్చార్ల చెరువు ప్రమాదపుటంచున ఉంది. చెరువు కింద వంకిరెడ్డిగారిపల్లె, ఎగువపాళ్యెం గ్రామాలకు చెందిన 400 ఎకరాల భూములున్నాయి. గత 15 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు నిండి మొరవ పోతోంది. చెరువు తూ ము రెండేళ్ల క్రితమే దెబ్బతింది. గండి పడి నీళ్లుపోతున్నా పట్టించుకోని పరిస్థితి. చెరువుకు రెండు పక్కలా మొరవలు ఉన్నా.. అందులో ఒక మొరవ దెబ్బతింది. ఇక వర్షం వస్తే పెనుముప్పు తప్పదని ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు.


