లారీ ఢీకొని యువకుడి మృతి
గంగవరం: లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నల్లసానిపల్లి గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు భరత్(23), మరో యువకుడు కార్తీక్(25) ఇద్దురూ కలిసి బోయకొండ గంగమ్మ దర్శనానకి స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలోని అప్పిన పల్లి క్రాస్ వద్ద ఎదురుగా వేగంగా పలమనేరు వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థిరతిలో కొట్టుమిట్టాడుతున్న భరత్‌ను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ మరో యువకుని చికిత్స కోసం చిత్తూరు, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మరో చోటకి తరలించినట్టు కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.
నాడిలో పట్టులేదా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో కేంద్ర బృంద పర్యటన శుక్రవారం ముగిసింది. ఈనెల 4వ తేదీ నుంచి ఆ బృంద అధికారులు జిల్లాలో పర్యటించారు. పీహెచ్‌సీ, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, డీఈఐసీలను పరిశీలించారు. ఈ పరిశీలన పూర్తవ్వడంతో శుక్రవారం ఉదయం కలెక్టర్‌తో సమీక్షించారు. జిల్లాలో వైద్యసేవల అమలు తీరుపై చర్చించారు. లోటుపాట్లను కూడా చెప్పు కొచ్చారు. ప్రధానంగా ఆరోగ్య కార్యక్రమాలపై, వైద్య సేవల్లో పట్టు లేనట్టు గుర్తించినట్లుగా తెలిసింది. సమీ క్ష తర్వాత మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో బృంద అధికారులు విజయవాడ బయలుదేరి వెళ్లారు.


