ఎత్తు తగ్గించి..ముంచి!
గంగాధర నెల్లూరు : మొరవ ఎత్తు తగ్గించేయడంతో భారీ వర్షాలకు భూములు మునిగిపోతున్నాయని మహదేవ మంగళం, మంగినాయినికుప్పం వాసులు లబోదిబోమంటున్నారు. మండలంలోని మహదేవ మంగళం వద్ద గల చెరువు గత కొద్దిరోజుల క్రితమే నిండిపోయింది. దాదాపు 110 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు మొరవెత్తింది. చెరువు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.75 లక్షలు మంజూరు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చెరువుకున్న మూడు మొరవల ఎత్తును తగ్గించేశారు. దీంతో భూములు మునిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మంగినాయని కుప్పం వద్ద గల మొరవపై నీరు కిందికి రాకుండా గ్రామస్తులు ఇసుక బస్తాలు వేసి నిలువరించారు. ఉన్న మొరవ నుంచి మహదేవ మంగళం ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. మరో మొరవ దళితవాడ వైపు ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మహదేవ మంగళం వద్ద
మహదేవమంగళం పాఠశాలలోకి వచ్చిన నీరు
ఎత్తు తగ్గించి..ముంచి!


