ఏయ్ నరేంద్ర.. నువ్వెవడు?
గంగవరం: శ్రీఏయ్ నరేంద్ర(రీ సర్వే డీటీ).. నువ్వెవడు.. నేను మట్టి తోలుతుంటే ఆపడానికి నీకెంత ధైర్యం. వీడియో తీరా.. ఎవరొస్తారో చూస్తా.. నన్నెవడూ ఏం చేయలేడు..శ్రీ అంటూ రీసర్వే డీటీని, రెవెన్యూ సిబ్బందిని, ఘటనా స్థలంలో లేని తహసీల్దార్‌ను కూటమి నేత అసభ్య పదజకాలంతో దూషించిన ఘటన మండలంలో శుక్రువారం వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని చిన్నూరు గ్రామానికి చెందిన కూటమి నేత చిట్టిబాబు మన్నార్‌నాయనిపల్లి గ్రామం వద్ద అప్పిరెడ్డి చెరువులో గత కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలు చేసి రియల్ ఎస్టేట్, ఇటుక బట్టీలకు రవాణా చేసేవాడు. ఒకటా, రెండా పదుల సంఖ్యలో చెరువులు అతని చెరకు బలయ్యాయి.
దీనిపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గత 4వ తేదీ మంగళవారం శ్రీసాక్షిశ్రీలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు వెంటనే అప్పిరెడ్డి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై దాడులు చేసి పనులు నిలిపేశారు. అంతటితో ఆగని అక్రమార్కుడు అధికారుల దాడులను పట్టించుకోకుండా మళ్లీ తన పని మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు మళ్లీ దాడులు చేసి రువు దారిలో జేసీబీతో కంచె ఏర్పాటు చేశారు. చెరువులో అనుమతి లేకుండా మట్టి తవ్వితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక బోర్డు పెట్టారు. అంతలో అక్కడికి చేరుకున్న కూటమి నేత చిట్టిబాబు రీసర్వే డీటీతో పాటు అధికారులను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు.
ఆ ప్రదేశంలో లేని తహసీల్దార్‌ను సైతం అవహేళన చేసి మాట్లాడాడు. ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను పట్టుకుని సార్ అని కూడా పిలవకుండా ఏయ్.. నరేంద్ర అంటూ సంబోధించాడు. నేను తలుచుకుంటే నువ్వెంతరా అంటూ ఊగిపోయాడు. అధికారులు ఎంత నిలువరించినా ఆగలేదు. దీంతో చేసేది లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై కూటమి నేత తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి నానా రభస చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తహసీల్దార్‌తో పాటు రీసర్వే డీటీ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఏయ్ నరేంద్ర.. నువ్వెవడు?


