శభాష్ రఘురామన్!
చిత్తూరు అర్బన్ : జాతీయ స్థాయి అవార్డు పొందిన పోలీస్ రఘురామన్‌ను ఎస్పీ తుషార్‌డూడి శభాష్ అంటూ అభినందించారు. మంగళవారం పోలీసు అతిథి గృహంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ పోలీస్ గ్రూప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌పై కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చిత్తూరు క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ రఘురామన్ పాల్గొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో తన దైన శైలిలో ప్రత్యేక ప్రతిభ చూపారు. ఇందుకు గాను ఆయనకు ఢిల్లీ డీఐజీ ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. ఉత్తమ అవార్డు పొందిన రఘురామన్‌ను ఎస్పీ అభినందించారు.
నాటుతుపాకీ కలిగిన వ్యక్తి అరెస్టు
బంగారుపాళెం: మండలంలోని బండ్లదొడ్డి గ్రామంలో అక్రమంగా నాటుతుపాకీ కలిగిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామానికి చెందిన లోకరాజు కుమారుడు రెడ్డెప్ప అడవి జంతువులను వేటాడేందుకు తుపాకీ వినియోగిస్తుండడంతో బసివిరెడ్డి మామిడి తోటవద్ద అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
శభాష్ రఘురామన్!


