ఆపద్బాంధవులవుదాం.. రండి! | - | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవులవుదాం.. రండి!

Sep 13 2025 4:23 AM | Updated on Sep 13 2025 4:23 AM

ఆపద్బ

ఆపద్బాంధవులవుదాం.. రండి!

● విపత్తుల సమయంలో స్పందించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ● ఈనెల 20లోపు దరఖాస్తులకు అవకాశం

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు, సమాజంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు స్పందించి సహాయ కార్యక్రమాలు చేడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు కూడా ప్రజలకు సేవలందిస్తుంటారు. అలాగే విపత్తు సమయాల్లో ఏం చేయాలి? అనే దానిపై అవగాహన కల్పిస్తుంటారు. అలాంటి వాటిలో పౌరరక్షణ దళం ఏర్పాటు చేయాలని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ భావించింది. యువ ఆపదమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు సంస్థ, మేరా యువ భారత్‌కు అప్పగించింది. ఆపద వేళ ఆదుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు జిల్లాలో అర్హత ఉన్న వలంటీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆపద మిత్ర పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి దరఖాస్తులు చేయించేందుకు నెహ్రూ యువ కేంద్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 140 దరఖాస్తులు అందినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

శిబిరం, చేయాల్సిన విధులు

అర్హులు ఎవరంటే

దరఖాస్తుకు సెప్టెంబర్‌ 20 వరకు గడువు

జిల్లాలో ఆపద మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు నెహ్రూ యువ కేంద్ర అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను చిత్తూరు జిల్లా కేంద్రం గిరింపేట వద్ద ఉన్న పగడమాను వీధిలో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 8368866411 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఈ పథకంలో ఎంపికయ్యే వారికి వారం పాటు ఉచితంగా శిక్షణ ఉంటుంది.

భూకంపాలు, వరదలు, కరువు, కరోనా, ప్రమాదాలు సంభవించినప్పుడు, అల్లర్లు చోటు చేసుకున్నప్పుడు ప్రజలను రక్షించడం. భద్రతా దళాలకు అండగా ఉంటూ సహాయం చేయడం.

గాయపడిన వారికి ప్రథమ చికిత్సలు చేయడం, పరిస్థితి విషమంగా ఉంటే దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించడం.

ట్రాఫిక్‌ నిర్వహణ వల్ల జన సముదాయాలను నియంత్రించడం.

విపత్తుల వేళ ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లడం

శిక్షణను విజయవంతంగా పూర్తిచేసే యువతకు ఆపత్కాలంలో ఉపయోగపడే కిట్‌, సర్టిఫికెట్‌ అందజేస్తారు.

ఆపద్బాంధవులవుదాం.. రండి! 1
1/1

ఆపద్బాంధవులవుదాం.. రండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement