
అక్కడ ఇసుక తవ్వకాలు నిషేధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషేధిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇసుక తవ్వేందుకు ఎక్కడైనా యంత్రాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించనా సహించేది లేదన్నారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్‌డీవో శ్రీనివాసులు, మైన్స్ డీడీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనం విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి శుక్రవారం కెనరా బ్యాంక్ ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందించింది. రూ.5.5 లక్షల విలువ చేసే ఈ వాహనాన్ని దివ్యాంగుల నిమిత్తం అందజేసినట్లు బ్యాంకు అధికారులు నాగేశ్వరారవు, అనురాధ, పాండురంగ తెలిపారు.