
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎంవీ రమణ
చంద్రగిరి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ఎంవీ రమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై వర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. వ్యవసాయ వర్సిటీలో వివిధ హోదాలలో 34 ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాలలో సుదీర్ఘ సేవలు అందించారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుతో పాటు 2015లో యూనివర్సిటీ స్థాయిలో ఏవీ కృష్ణయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. రిజిస్ట్రార్ పదవికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది.