
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పొలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు.
–జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎంపీ, చిత్తూరు