
ప్రభుత్వం కక్ష సాధింపు
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి భారతదేశం బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తోంది. పత్రికలు, జర్నలిస్టులపైన కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. స్టేట్‌మెంట్లు ఇచ్చినా కేసులు పెడతారా? ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. వాస్తవాలు భయటపెట్టే పత్రికలపై కేసులు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది.
– ఆర్ కే రోజా, మాజీ మంత్రి