
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
– 8లో
– 8లో
వైభవంగా కలశ ఊరేగింపు
కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా, మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి ప్రకృతి సంపదను దోచుకుంటున్న పచ్చనేతలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతోంది. నిజాలను వెలికితీసే పత్రికలపైనా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడంలేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. పత్రికల గొంతునొక్కి, జర్నలిస్టులను మానసికంగా ఇబ్బంది పెట్టి , భయపెట్టేందుకే ఇలాంటి చేతగాని రాజకీయాలు చేస్తున్నారు. నిజాలను ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టడం దుర్మార్గం.
– కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి