పట్టుబడ్డ వారిలో కూటమి పార్టీ నేతలే అధికం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ నెట్టింకటయ్య కథనం మేరకు.. గంగనపల్లెలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. ఇక్కడ పేకాట ఆడుతున్న కెఎస్.మధు (57), పి.జగదీష్ (39), ఎంజి.ఆనంద్‌బాబు (38), ఐ.రియాజ్ భాష (40), పికె.ఆసీఫ్ (29), ఎండి.షరీఫ్ (33), ఎస్.హసీఫ్ (30), ఎం.లోకేష్ (37), డి.ధనుష్ (21), జె.ఉమాపతి (28), ఆర్.మణికంఠ (29), కె.మోహన్‌బాబు (36), ఎంఆర్.జయప్రకాష్ (51), వి.ఏలుమలై (52), పి.సదాశివ (58), కె.శివ (47), పి.బషీర్ (52), పి.స్వాతికిరణ్ (43), ఎన్.జ్యోతీశ్వరన్ (44), ఎ.రాజ్‌కుట్టి (35), ఎస్.రాజా (36), జి.షాన్వాజ్ (40), ఎస్‌కె.మున్నా (40)ను అరెస్టు చేసి, ఆపై 41 నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. నిందితుల వద్ద రూ.37,160 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా పోలీసులకు చిక్కిన నిందితుల్లో కూటమి పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి పదవుల్లోని వాళ్లూ ఉన్నారు.
విద్యాలయంలో మందుబాబుల ఆగడాలు
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని వన్నియర్ బ్లాక్‌లో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. విద్యాలయంలో రాత్రి సమయాల్లో మందుబాబులు మద్యం సేవించి బాటిళ్లను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారు. అదే విధంగా ఆ పాఠశాలలో ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్ నిచ్చెన మెట్లు మరమ్మతులకు లోనుకావడంతో ప్రమాదకరంగా మారింది. చిన్నారులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల వద్ద రాత్రి సమయాల్లో పోలీసుల గస్తీ పెంచి వాచ్‌మన్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.