
దళిత ద్రోహి చంద్రబాబు
దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే పవన్‌కల్యాణ్‌కు పట్టదా? జగనన్నను సీఎం చేసుకోవడమే లక్ష్యం కేసులకు భయపడకుండా కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడదాం వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు
తిరుపతి మంగళం: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని దళితులను హేళనగా మాట్లాడిన దళిత ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఆర్ సుధాకర్‌బాబు, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావుతో పాటు ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, లలితా థామస్, నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దళిత మహిళలపై ఆత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అండగా ఉంటా మహిళల జోలికి వస్తే తాటతీస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్‌కల్యాణ్‌కు దళిత మహిళ ఆత్యాచారాలు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దళితులంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. సమాజంలో దళితులకు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవులను కల్పించిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనని.. అలాంటి గొప్ప నాయకున్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సైనికుల్లా పని చేద్దామన్నారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎనభై ఏళ్ల క్రితమే దళిత కుటుంబంతో వివాహ బంధం ఏర్పరుచుకుని దళితులతో బాంధవ్యాన్ని కలుపుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తు చేశారు. అనంతరం భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రూ.2.80 లక్షల కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అందించిన గొప్ప నాయకుడు జగనన్న అన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు సునీల్‌కుమార్, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ జగనన్న అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఉంటాయన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్‌కుమార్, అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్ నల్లాని బాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్‌కుమర్, పుణీతమ్మ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.