
పుంగనూరులో స్వామి వారి శోభాయాత్ర
పుంగనూరు : హరిహరపురం మఠాధిపతి శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే పట్టణంలో తొలిసారిగా హిందూ శోభాయాత్ర నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆయన పుంగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందువులు ఏకమై స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారు శ్రీచక్రన వారణ పూజా కార్యక్రమాలు సాయంత్రం ని ర్వహించి, భక్తులకు ఉపదేశం ఇచ్చారు. హిందువులు ఐకమత్యంతో ఉండాలని, శాంతి భా వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
నియామకం
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీ.వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఆభా ఐడీ విధిగా నమోదు చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆభా (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) ఐడీని విధిగా నమోదు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం డాకర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు డిజిటల్ మిషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆభా ఐడీ ప్రతి ఒక్కరికీ నమోదు చేయి ంచాలన్నారు. తద్వారా వైద్య సేవలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారన్నారు. ప్రస్తుతం కుప్పంలో నర్వ్ సెంటర్ నడుస్తోందన్నారు. అలాగే చిత్తూరులో కూడా సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆభా ఐడీ నమోదులో అలసత్వం వద్దని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంఓ ప్రవీణ, వైద్యులు అనూష, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజీ చేసుకోదగ్గ కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని.. వివరాలకు చిత్తూరు కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలన్నారు.
15 నుంచి ఇంటర్ త్రైమాసిక పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలు ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్ధుల్ మజీద్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నియమ, నిబంధనల మేరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఉత్తర్వులు అందాయన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈనెల 15 నుంచి అక్టోబర్ 10 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని ప్రిన్సిపల్ వెల్లడించారు.
డిమాండ్ల పరిష్కారానికి నిరసనలు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు నిరసనలు చేపట్టారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. తమ నిరసనలు ఈ నెల 17 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.