
వైభవంగా కలశ ఊరేగింపు
కాణిపాకం : వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్షవాహన సేవను పురస్కరించుకుని కాణిపాకంలోని దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం కలశంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. శివాలయం నుంచి 501 కలశాలతో పురవీధుల్లో కోలాటలు, కేరళ వాయిద్యం, తప్పెటగుండ్లు నడుమ అత్యంత వైభవంగా కలశాలతో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓలు ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్పవృక్షవాహన సేవలో భాగంగా ఆలయాన్ని శోభయామానంగా తీర్చిదిద్దారు.

వైభవంగా కలశ ఊరేగింపు

వైభవంగా కలశ ఊరేగింపు