
ఎర్రమట్టి రవాణాలో తమ్ముళ్ల కుమ్ములాట
పాలసముద్రం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్, టీడీపీ రాష్ట్ర నాయకుడు చిట్టిబాబునాయుడు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటోందని కొంత మంది టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇలా వారిద్దరి మధ్య విభేదాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఎర్రమట్టి గ్రావెల్ క్వారీలో అక్రమంగా తమిళనాడుకు తలిస్తున్నారు. వీటిని అడ్డుకట్ట వేసేందుకు చిట్టిబాబు నాయుడు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినా అక్రమ ఎర్రమట్టి గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతూనే ఉంది. అధికారులు కూడా ఎర్రమట్టి గ్రావెల్ ఆపితే ఎమ్మెల్యే ఏమంటారోనని.. ఆపకపోతే రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు నాయుడు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తారని భయాందోళన చెందుతున్నారు. ఇలా ఎమ్మెల్యే వర్గం.. రాష్ట్ర టీడీపీ నేత చిట్టిబాబు వర్గం ఎర్రమట్టి రవాణాలో ఎవ్వరికి వారే యమునా తీరేలా వ్వవహరిస్తున్నారు.