
ద్విచక్ర వాహనం డీకొని వ్యక్తి మృతి
వి.కోట: బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వి.కోట –పెర్నంబట్ జాతీయ రహదారిలోని ఏడుచుట్లకొట్ల గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని చింతమాకులపల్లి గ్రామానికి చెందిన చిన్న బిడ్డప్ప కుమారుడు శ్రీనివాసులు(65) కూలి పనులు ముగించుకుని ఏడుచుట్ల గ్రామం వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన వ్యక్తి బైక్‌పై వి.కోట నుంచి పెర్నంబట్టు వైపు వెళ్తున్న శ్రీనివాసులును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ీప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు అప్పటికే మృతిచెందిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సోమశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.