
ఆటో అదుపు తప్పి .. గాయాలు
దుర్గసముద్రం వద్ద ప్రమాదం గాయాలైన 9 మంది గౌదమాకులపల్లె కూలీలు ముగ్గురి పరిస్థితి ఆందోళకరం
చౌడేపల్లె : అయ్యో.. పొట్టనింపుకోవడానికి కూలీ పనుల కోసం వచ్చి పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా దుర్గసముద్రం వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలపైకి తెచ్చుకొన్న ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం గౌదమాకులపల్లెకు చెందిన కొందరు ఆటోలో చౌడేపల్లె మండలం ఎర్రప్పల్లె వద్ద టమోటా తోటలో కూలీ పనుల కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో దుర్గసముద్రం వద్ద వెళ్తుండగా గుత్తివారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ విశ్వనాథ్ (38)కు ఫిట్స్ రావడంతో వాహనంను రోడ్డు పక్కనే ఉన్న శంకరప్ప ఇంటిలోకి ఆటో వేగంగా దూసుకెళ్తు ఎదురుగా ఉన్న రాతి కూసాలు, గోడను ఢీకొని ఆటో ఆగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నహేమశ్రీ (32)మంజుల (35)హారతి (18) టి.మంజుల(40)లక్ష్మమ్మ(45) సుబ్బమ్మ(52) లతో పాటు మరో ఇద్దరికి గాయాలైయ్యాయి.స్థానికులు ప్రవేటు వాహనంలో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వీరిలో మంజుల, హారతి, హేమశ్రీల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మదనపల్లెకు రెఫర్ చేశారు. సుమారు గంట సేపు 108 వాహనం కోసం క్షతగాత్రులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎదురుగా వాహనంను ఢీకొని ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేదని కూలీలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకొన్న ఎస్‌ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఆటో అదుపు తప్పి .. గాయాలు

ఆటో అదుపు తప్పి .. గాయాలు

ఆటో అదుపు తప్పి .. గాయాలు

ఆటో అదుపు తప్పి .. గాయాలు