
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇలాంటి విధానాల వల్ల సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, భద్రత లాంటివి రేపటి సమ సమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలే కానీ, గొంతు నొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగునపరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని గతంలోకి లక్నోకి చెందిన కేసులో సుప్రీం కోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేయరు.