
పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
గుడిపాల : పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకంగా ఉండాలని జెడ్పీ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీలకు జమ చేయడం జరిగిందని వాటిని ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటికి ఉపయోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుడిపాల మండలంలోని ఎస్సీలు అధికంగా ఉన్న పశుమంద, వెంగమాంబపురం, కొత్తపల్లె, శ్రీరంగంపల్లె, మరకాలకుప్పం గ్రామాలకు రూ.20 లక్షలు మంజూరైందని వీటిని సీసీ రోడ్లు మినహా మిగతా పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో కుమార్, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్‌నాయుడులు , తదితరులు పాల్గొన్నారు.