
క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి లేజర్ రన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ సాధించిన చిత్తూరు క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఆ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. బీహార్ రాష్ట్రం బెంగుసారాలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 9వ జాతీయ స్థాయి లేజర్ రన్ పోటీల్లో చిత్తూరు విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో అర్హత పొంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి సాయి భార్గవ్‌ను అభినందించారు. ఈ విద్యార్థి దేశం తరపున సౌత్ ఆఫ్రికాలో డిసెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్, మెడల్స్ అందజేసి అభినందించారు.