
విద్యుత్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
గంగాధర నెల్లూరు : ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి పిలుపు నిచ్చారు. గంగాధర నెల్లూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో బుధవారం విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు సకాలంలో సంబంధిత సిబ్బంది పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ సాంకేతిక ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి , విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ. సురేష్ కుమార్, డీఈలు శేషాద్రి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు, గంగాధర నెల్లూరు , ఆవలకొండ విద్యుత్ శాఖ ఏఈలు వరదరాజులు, తనిగవేలు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.