
చంద్రప్రభపై వరసిద్ధుడు
కాణిపాకం : ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బుధవారం చంద్రప్రభ వాహనంపై కటాక్షించారు. తొలుత మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేశారు. చందన అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. చంద్రప్రభ వాహన సేవలో భాగంగా ఉభయదారులు క్షీర కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన ఆలయ కల్యాణ వేదికలో ఉత్సవమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
నేడు కల్పవృక్షవాహనం
కాణిపాక ఉత్సవంలో భాగంగా గురువారం స్వామివారు కల్పవృక్ష వాహనంలో ప్రత్యక్షమవనున్నారని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. రాత్రి కల్పవృక్షవాహన సేవ ఉంటుందన్నారు.