
నేడు రెడ్ రన్ మారథాన్
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ.. బుధవారం చిత్తూరులో రెడ్ రన్ మారథాన్‌ను నిర్వహించనున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటలకు మెసానికల్ మైదానం నుంచి ఈ రన్ ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు అర్హులని, రన్‌లో ప్రతిభ కనబరచిన వారికి నగదు బహుమతి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మెసానికల్ మైదానం వద్దకు చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
పంటలు ధ్వంసం
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె, పాతపేట పంచాయతీల్లో మంగళవారం తెల్ల వారు జామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసం చేసింది. పది రోజులుగా వరస బెట్టి ఒకే ప్రాంతంలో ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. చల్లావారిపల్లెలో మొక్కజొన్న పంటను తిని తొక్కి నాశనం చేశాయి. అలాగే పనస, మామిడి, అరటి, వేరుశనగ పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల బారినుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
యూరియా పంపిణీ పరిశీలన
పెద్దపంజాణి: మండలంలోని పెద్దపంజాణి, కొళత్తూరు, వీరప్పల్లి రైతు సేవా కేంద్రాలలో యూరియా పంపిణీని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌కేల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ–కేవైసీ, బయోమెట్రిక్‌తో డీబీటీ పద్ధతిలో పారదర్శకంగా రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట 20 రోజుల తర్వాత మరో విడత యూరియా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఏడీఏ శివకుమార్, ఎంపీడీఓ బాలాజీ, ఏఓ హేమలత, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
యూరియా కొరత లేదు
పుంగనూరు: ప్రస్తుతం ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులందరికీ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని యూరియా గోడౌనును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. లక్ష్యాన్ని మించి యూరియాను సరఫరా చేస్తున్నామని, వ్యవసాయాధికారుల సూచనల మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. కలెక్టర్ వెంట జేడీ మురళీకృష్ణ, ఏడీ శివకుమార్ ఉన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లోనే
ప్రసవం జరగాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి ఆదేశించారు. చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం జననీ సురక్ష యోజన పథకంపై వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. హైరిస్క్ కేసులకు అందించే వైద్య సేఓవల విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. ప్రతి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ జననీ సురక్ష కింద అర్బన్ ప్రాంతాల వారికి రూ.800, రూరల్‌కు రూ.1000 చొప్పున్న డీబీటీ ద్వారా ఇవ్వాలన్నారు. అలాగే ఎన్‌హెచ్‌ఎం ఫండ్స్‌పై చర్చించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు రోజారాణి, రామ్మోహన్, వైద్యులు పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓ భరణి బదిలీ
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్‌ఎస్‌ల బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా డీఎఫ్‌ఓ భరణి బదిలీ అయ్యా రు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భరణిని శాప్ ఎండీగా బదిలీ చేయగా.. ఆమె స్థానంలో జిల్లాకు 2022 బ్యాచ్‌కు చెందిన కోడూరు సబ్‌డీఎఫ్‌ఓగా ఉన్న సుబ్బురాజును నియమించారు.

నేడు రెడ్ రన్ మారథాన్

నేడు రెడ్ రన్ మారథాన్

నేడు రెడ్ రన్ మారథాన్