– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
అవస్థల మధ్యే అరకొర పంపిణీ
గంటల కొద్దీ క్యూలో నిరీక్షణ
రైతన్నకు తప్పని ఆపసోపాలు
చిత్తూరు కలెక్టరేట్ సోమవారం ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. సమస్యల పరిష్కారం కోసం పలువురు క్యూకట్టారు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
వెట్టిచాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కలిగించిన ఘటన జీడీనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది.
మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
చౌడేపల్లె మండలం, దుర్గసముద్రం రైతుసేవా కేంద్రం వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు
గంగవరం: మండలంలోని (గుండుగల్లు, పసుపత్తూరు) క్లస్టర్‌కు 200 బస్తాలు, (దండపల్లి, మారేడుపల్లి) క్లస్టర్‌కు 200, జీడిమాకులపల్లికి 150, కొత్తపల్లికి 200, గంగవరం 1, 2 క్లస్టర్‌కు 200, గండ్రాజుపల్లి 1, 2 క్లస్టర్‌కు 200, మామడుగుకి 200 బస్తాల యూరియా వచ్చింది. వ్యవసాయాధికారి రఖీబా, రైతు సేవా సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం పంపిణీని ప్రారంభించారు. అయితే ఒక్కో సచివాలయ పరిధిలో వేల మంది రైతులు క్యూలో బారులు తీరారు. ముందుగా టోకెన్లు పొందిన రైతులకు యూరియా బస్తాలు సరిపోగా.. వెనుకబడిన రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎదురైంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన క్లస్టర్లకు యూరియా రాకపోవడంతో రైతులు గందరగోళానికి గురయ్యారు.
తీరని యూరియా కష్టాలు
పెద్దపంజాణి: యూరియా కోసం అన్నదాతలు మండలంలోని శంకర్రాయలపేట, రాజుపల్లి, బట్టందొడ్డి, తుర్లపల్లి, కొళత్తూరు, లింగాపురం, పెద్దపంజాణి రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజం శూన్యం. దీంతో ఉదయమే ఆర్‌ఎస్‌కేల వద్దకు చేరుకున్నారు. అన్ని పనులు వదిలేసి క్యూలో నిలబడితే ఒకేఒక్క బస్తా యూరియా ఇవ్వడంతో ఆవేదనకు లోనయ్యారు. అదికూడా సగం మందికి కూడా ఇవ్వలేదని రైతులు వాపోయారు. రోజంతా పడిగాపులు కాసినా ఒక్క బస్తా యూరియా దొరకండం లేదని వాపోయారు.
నువ్వు ముందా..నేను ముందా?
చౌడేపల్లె: మండలంలోని 12 రైతుసేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తారని ప్రకటించడంతో అధిక సంఖ్యలో రైతుసేవా కేంద్రాల వద్దకు రైతులు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్‌లు చేతపట్టుకొని ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. కూటమి నేతలు కొందరు పంపిణీ కేంద్రాల వద్ద చేతివాటం ప్రదర్శించి తమవారికే ముందు యూరియా ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. దుర్గసముద్రం సచివాలయం వద్ద అగ్రికల్చర్ అసిస్టెంట్ రమణమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ రియాజ్ తప్ప ఎవరూ సకాలంలో విధులకు రాలేదు. అప్పటికే అక్కడకు వందల మంది రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. లద్దిగం రైతుసేవాకేంద్రం వద్ద రైతులు గుంపులు గుంపులుగా వెళ్లడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో కేంద్రం వద్ద 150 బస్తాల యూరియా మాత్రమే స్టాకు ఉండడంతో నువ్వుముందా..నేను ముందా..? అనే ఆతృతతో రైతులు పోటీపడ్డారు. చివరికి సీఐ రాంభూపాల్, వ్యవసాయశాఖ ఏడీఏ శివకుమార్, ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఏఓ మోహన్ రైతులతో మాట్లాడారు. ఉన్న స్టాకును పంపిణీ చేయగా మిగిలిన రైతులకు టోకన్లు జారీ చేశామని, త్వరలో వారందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రైతులు దానికి సంతృప్తి చెందలేదు. అదునుదాటాక యూరియా ఇస్తే ఏం లాభం అంటూ పెద విరవడం కనిపించింది.
ప్రత్యేక విద్యుత్ అదాలత్ రేపు
చిత్తూరు కార్పొరేషన్: ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను బుధవారం జీడీనెల్లూరు డీఈ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో రూరల్ ఈఈ సురేష్ తెలిపారు. విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు. పెనుమూరు, ఆవులకొండ, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, నగరి, పన్నూరు, నిండ్ర సెక్షన్ల పరిధిలోని వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు.
సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యం
చిత్తూరు కలెక్టరేట్ : సంపూర్ణ అక్షరాస్యతతోనే ప్రగతి సాధ్యమని జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బీఎస్ కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అక్షరాస్యులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నిరక్షరాస్యతను రూపుమాపేందుకు అనేక పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం జిల్లాలో అమలువుతోందన్నారు. జిల్లాలోని 76,410 మందిని ఉల్లాస్ కార్యక్రమంలో గుర్తించి అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కోమల పాల్గొన్నారు.
నేడు అన్నదాతపోరు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాతపోరు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు స్థానిక గంగినేని చెరువు వద్ద నుంచి 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరుతామని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందజేస్తామన్నారు. తమతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, పార్టీ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
చిత్తూరు అర్బన్: రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ధర్నాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఆంక్షలు విధించింది. చిత్తూరులో రైతులకు యూరియా పంపిణీ ఇప్పటికే ప్రారంభించారని, కావలసిన అంత స్టాకు కూడా ఉందని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. యూరియా కొరత ఉందని రైతులను రెచ్చగొట్టొద్దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద కేవలం పది మంది పార్టీ నాయకులకు మాత్రమే అనుమతుందని, ర్యాలీలు, నిరసనలు తెలియజేయడానికి వీల్లేదంటూ తెలిపారు. దీనికి తోడు చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. చిత్తూరులోని మూడు నియోజకవర్గాల్లో ర్యాలీలు ఊరేగింపులు నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రజాసమస్యపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కడానికి పోలీసు శాఖ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యం వద్దు
చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్ని ఏఎస్పీ రాజశేఖరరాజు చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్‌తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్‌క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 37 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
యూరియా..
బ్లాక్ మార్కెట్‌కు తరలుతోందా?
బైరెడ్డిపల్లె: యూరియా కోసం బారులు తీరిన రైతులు
పెద్దపంజాణి: యూరియా కోసం గుమికూడిన రైతులు
యాదమరి : యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు
గంగవరం: గుండుగల్లు రైతు సేవా కేంద్రం వద్ద రైతుల తంటాలు
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. తాజాగా సోమవారం పూరేడువారిపల్లె, కల్లూరు, కొంగరవారిపల్లెల్లోని పంట పొలాలను సర్వనాశనం చేశాయి. వరి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశాయి. ఇనుపగేట్లు, మామిడి చెట్ల కొమ్మలను విరిచివేశాయి.
మండేగుండెలు!
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్న దివ్యాంగురాలు రిహానా తండ్రి
‘మేమేమి చేశాము పాపం. మాకెందుకింత శిక్ష వేస్తున్నారు. మాపై కక్ష సాధింపులెందుకు..? పాలకులారా.. మా బిడ్డల గోడు తగలకుండా పోదు.. మా బాధ మిమ్మల్ని క్షోభించకుండా వదలదు..’ అంటూ అవిటివారైన తమ బిడ్డలనెత్తుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో తల్లిదండ్రులు గంటలకొద్దీ నిరీక్షించడం చూపరులను కదిలించింది. మా బాధ ఆలకించండి మహాప్రభో అంటూ..! కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట కనిపించింది. చిత్తూరు జిల్లా, ఐరాల మండల కేంద్రంలో నివాసముంటున్న షేక్ అల్తాఫ్, ముక్తియార్ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వారి కుమార్తె రిహానా అవిటితనంతో జన్మించింది. ప్రస్తుతం బాలికకు 14 ఏళ్లు. నడవలేదు. కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. కనీసం కూర్చోలేని పరిస్థితి. అన్నం కూడా స్వతహాగా తినలేదు. తల్లిదండ్రులే సపర్యలు చేయాల్సిన దుస్థితి. బిడ్డ బాగోగుల కోసం ఉన్నదంతా అమ్మి ఆస్పత్రులకు పెట్టేశారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీనాలి చేసి బిడ్డను పోషించడం కష్టతరంగా మారింది. తన కుమార్తెకు దివ్యాంగ పింఛన్ రూ.15 వేలు ఇప్పించాలని మొదట ఐరాల మండల అధికారులను అభ్యర్థించారు. ఆపై న్యాయం జరగకపోవడంతో ప్రతి సోమవారం అక్కడి నుంచి ఆటో పెట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా ఇప్పటికి 12 సార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు హాజరయ్యారు. బిడ్డను చేతిలో పెట్టుకుని న్యాయం చేయాలంటూ మండుటెండలో గంటల కొద్దీ నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మనసు లేని అధికారులు ఇప్పటికై నా కనికరిస్తారో.. లేదా తమ కఠినత్వం ఇందేనని మరోమారు రుజువు చేస్తారో వేచి చూడాలి మరి!.
– చిత్తూరు కలెక్టరేట్
న్యాయం కోసం తండ్రి పడుతున్న ఆరాటం, అద్దె ఆటోలో రిహానాను కలెక్టరేట్‌కు తీసుకొస్తూ..
‘ఏం ప్రభుత్వమో ఏమో..! పొద్దుపొడవక ముందే సద్ది కూడా తినకుండా వచ్చేశాం. ఎర్రటి ఎండలో.. నోరు పిడసగట్టుకుపోతున్నా రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టాం. అందరికన్నా ముందు ఉంటే ఒక బస్తా యూరియా అన్నా దొరుకుతుందని ఆశపడ్డాం. మేమొచ్చే లోపే క్యూకట్టేశారు. ఇంకేం చేయలేక.. కాళ్లు పీకేస్తున్నా ఇక్కడే ఉండిపోయాం. యాడికిపోయినా యూరియా లేదంటున్నారు. ఇప్పుడీ రైతు సేవా కేంద్రాలకొచ్చినా క్యూలో ముందున్న వారికి ఒక్కో బస్తా యూరియా ఇచ్చి పంపించేశారు.. కొందరు యూరియా కోసం కొట్లాట వరకు దిగేశారు. ఇలాంటి పరిస్థితి మేమెప్పుడూ చూడలేదు.. ఇక మాపరిస్థితి ఏందో తెలియడం లేదు’ అంటూ సోమవారం రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులు చర్చించుకోవడం కనిపించింది.
ఒక్క బస్తా కోసం..
యాదమరి: మండలంలోని బోదగుట్టపల్లి, 184గొల్లపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు పోలీసు బందోబస్తు నడుమ మండల వ్యవసాయాధికారులు యూరియా సరఫరా చేశారు. ఎన్నో ఆశలతో యూరియా కోసం రైతన్నలు ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షించినా చివరికి నిరాశే ఎదురైంది. మండలానికి కేవలం 300 బస్తాలు యూరియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఒక్క బస్తా యూరియాతో పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు నిలదీశారు. త్వరలోనే మరింత యూరియా వస్తుందని తహసీల్దార్ పార్థసారథి, ఏఓ దీప రైతులకు భరోసా ఇచ్చారు. కాగా నేడు మండలంలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేయనున్నట్టు ఏఓ తెలిపారు.
జిల్లాలో దయనీయంగా యూరియా నిల్వలు
కాణిపాకం: జిల్లాలో ఎప్పుడూ లేన్నంతగా గత ఏడాదిన్నర కాలంలోనే యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా పక్కదారి పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరఫరా అవుతున్న యూరియా మొత్తం కొన్ని ప్రైవేటు దుకాణాలకు కేటాయించడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అక్కడి నుంచి యూరియాను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాలుండగా.. ప్రైవేటు షాపులకు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇచ్చి..అలా బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడుతున్నారు. తర్వాత సిఫార్సులతో కొంత మందికి యూరియాను కావాల్సినంత ఇవ్వడం సమంజసం కాదంటున్నారు.
ఆర్బీకేల ద్వారా ఎందుకివ్వరు?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసింది. రైతులకు అవరసరమైన విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు అందిస్తూ వచ్చింది. రైతులకు కావాల్సినంత మేరకు యూరియాను అందజేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బీకేలను నీరుగార్చింది. రైతు సేవలను దూరం చేస్తోంది. కేవలం మండల కేంద్రంలోని సొసైటీలు, ప్రైవేటు దుకాణాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది.
అవస్థలు ఎన్నో..!
యూరియా క్షేత్ర స్థాయిలో అందకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. మండల స్థాయిలోని ప్రైవేటు దుకాణాలకు యూరియా పంపిణీ బాధ్యతలు ఇవ్వడంతో రైతులు పడిగావులు కాయాల్సి వస్తోంది. రైతులు పనులు మానుకుని పంపిణీ కేంద్రం వద్ద గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. తొక్కిసలాట.. తోపులాటలో నలిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విధిలేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్తా యూరియా రూ.260 నుంచి రూ.280 ఉండగా.. బ్లాక్ మార్కెట్‌లో అదనంగా రూ.450కి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
బారులు తీరిన రైతులు
బైరెడ్డిపల్లె : ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం క్యూలో వేచి ఉన్నా కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని 7 రైతు సేవా కేంద్రాల్లో సోమవారం 2,250 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. అయితే ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే పంపిణీ చేశారు. దీనికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు వాపోయారు.
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్