వరసిద్ధుని వైభవం | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుని వైభవం

Sep 8 2025 7:12 AM | Updated on Sep 8 2025 7:12 AM

వరసిద

వరసిద్ధుని వైభవం

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం మూలవిరాట్‌కు పంచామృతి అభిషేకం నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి ఈ మేరకు రావణబ్రహ్మ వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైభవంగా ఊరేగించారు. భక్తులు కర్పూరహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు.

అలరించిన నృత్యం

ఆలయంలోని ఆస్థాన మండపంలో నిర్వహించిన కూచిపూడి, భరత నాట్యం అలరించాయి. అలాగే గీతాలపాలనలు భక్తులను హృదయాలను రంజింపజేశాయి. ఈ సందర్భంగా కళాకారులను ఈఓ పెంచలకిషోర్‌ సత్కరించారు.

నేడు యాళివాహన సేవ

ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి యాళివాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ పెంచల కిషోర్‌ తెలిపారు.

వరసిద్ధుని వైభవం1
1/1

వరసిద్ధుని వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement