
కాలనీలో మౌలిక వసతులు కల్పించలేదు
కాలనీలో మౌలిక వసతులు కల్పించడం లేదని తవణంపల్లి మండలం, కట్టకిందపల్లి విజయనగరం యానాది కాలనీ వాసులు అర్జీ ఇచ్చి ఏడాదవుతోంది. ఆ కాలనీలోని 40 కుటుంబాలు సమస్య పరిష్కారం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఆ కుటుంబాలకు గత ప్రభుత్వం సొంత గృహాలు నిర్మించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో మౌలిక వసతులు లేవు. అప్పటి నుంచి అర్జీలిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అదేవిధంగా వారి పిల్లలకు ఆధార్ కార్డులు లేక బడులకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. రేషన్ కార్డులు లేకపోవడంతో బియ్యం అందుకోలేకపోతున్నారు. వారి సమస్యలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి.