
పరిష్కారం ఎలా?
సంవత్సరాల తరబడి పరిష్కారం కాని అర్జీలు ఎన్నిసార్లు ఇచ్చినా ఒకటే సమాధానం ఏడాదిగా ఇదే పరిస్థితి కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోతున్న ప్రజలు
సమస్యలు ఇలా..
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అర్జీదారుల అవస్థలు అన్నీఇన్నీకావు. వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేసినా సకాలంలో పరిష్కారం గాక అవస్థలు పడాల్సి వస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు నెలలు, సంవత్సరాలవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది. అయ్యా...న్యాయం చేయండంటూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినా క్షేత్ర అమలు కాకపోవడంతో తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తున్న అర్జీదారులపట్ల కొందరు మండల రెవెన్యూ అధికారులు ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’.. అంటూ తెగేసి చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీదాల అవస్థలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
స్పందన కరువు
తమ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమిస్తున్నారని ఐరాల మండలం, బలిజపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అధికారులకు అర్జీ ఇచ్చారు. సొంత ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మొరపెట్టుకున్నారు. 36 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణానికి పునాదులు వేస్తే కూల్చేశారని వాపోయారు. ఈ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని ఎనిమిది సార్లు అధికారులకు అర్జీ ఇచ్చారు. అయితే ఏ మాత్రం స్పందన లేదు.

పరిష్కారం ఎలా?

పరిష్కారం ఎలా?