
నిందితుడి అరెస్టు
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడ్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌లో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(11)ను అదేగ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పాఠశాల వద్ద విడిచిపెడతానని చెప్పి నమ్మబలికాడు. బాలికను బైక్‌లో ఎక్కించుకున్న ప్రసాద్ కమ్మకండ్రిగ సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో ప్రతిఘటించింది. ఆ తరువాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇనాంకొత్తూరు సమీపంలో నిందితుడు ప్రసాద్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. వెదురుకుప్పం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా?
పలమనేరు: స్మార్ట్ రేషన్ కార్డులను పలమనేరులో ఇష్టానుసారంగా పంపినీ చేస్తున్నారు. అసలు వీటిని ఎవరూ పంపిణీ చేస్తున్నారో కూడా తెలియ ని పరిస్థితి నెలకొంది. పట్టణంలో గురువారం పలు వీధుల్లో స్మార్ట్ కార్డులను కొందరు ఇచ్చి మీ కార్డు ఉంటే మీరే తీసుకోండంటూ నిర్లక్ష్యంగా పడేశారు. అందుబాటులో ఉన్నవారు వారి కార్డులను తీసుకున్నారు. మరికొందరు బంధువులని, తెలిసిన వారివంటూ తీసుకెళ్లారు. పంపిణీలో నిర్లక్ష్యంకారణంగా ఎవరికై నా కార్డు లేకుండాపోతే దానికి బాధ్యులెవరని..? జనం ప్రశ్నిస్తున్నారు. దీనిపై పట్టణానికి చెందిన మోహన్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

నిందితుడి అరెస్టు