
బాల్య వివాహాలు నివారిద్దాం
పలమనేరు: బాల్య వివాహాల నివారణపై క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలు దృష్టి సారించాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో గురువారం స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో బాల్యవివాహాల నివారణ, లైంగిక నేరాల చట్టాలపై వివిధ శాఖలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల విషయంలో అంగన్‌వాడీ వర్కర్ల పాత్ర చాలా కీలకమన్నారు. గ్రామ స్థాయిలో దీనిపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌డీఓ భవాని మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వరి, లీగల్ ఆఫీసర్ వెంకటేశులు, శివశంకర్, చైల్డ్ హెల్ఫేర్ కో–ఆర్డినేటర్ నాగమణి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జయరాముడు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.