
బాస్కెట్ బాల్‌లో ‘విజయం’ సత్తా
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో విజయం కళాశాల విద్యార్థులు సత్తా చాటి విజేతలుగా నిలిచినట్లు విద్యాసంస్థ చైర్మన్ తేజోమూర్తి తెలిపారు. బుధవారం ఈ మేరకు గెలుపొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమన్నారు. తమ కళాశాల డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి గురుచరణ్ విశేష ప్రతిభను ప్రదర్శించినట్లు వెల్లడించారు. అనంతరం జట్టుకు అభినందనలు తెలిపారు. అధ్యాపకులు మోహన్‌నాయుడు పాల్గొన్నారు.